Hon’ble CM Sri A. Revanth Reddy Addresses the Public Meeting at GHMC Sports Stadium, Amberpet, Hyderabad, Following the Inauguration of the Moosarambagh High-Level Bridge.
విధ్వంసానికి గురైన తెలంగాణను వికాసం వైపు నడిపించడం కోసం గడిచిన వెయ్యి రోజుల ప్రజా ప్రభుత్వ పరిపాలనలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వెయ్యి రోజుల పాలనలో రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక సామాజిక అంశాల్లో దూరదృష్టితో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించారు.
“తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిన తెలంగాణలో గడిచిన వెయ్యి రోజుల్లో రూపాయి రూపాయి కూడబెట్టి ముళ్లబాట నుంచి హైవేకు తీసుకొచ్చాం. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తుంటే, చూసి ఓర్వలేక కొందరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ఒక్కటొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ పరిపాలనను పట్టాలెక్కించాం. ప్రభుత్వాన్ని సాఫీగా నడిపిస్తా. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా..” అని ముఖ్యమంత్రి గారు ఘాటుగా స్పందించారు.
మూసీ నదిపై మూసారాంబాగ్ వద్ద కొత్తగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ (GHMC), మల్కాజిగిరి (MMC), సైబరాబాద్ (CMC) మున్సిపల్ కార్పొరేషన్ల లోగోలను ఆవిష్కరించారు.
ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలనపై చేసిన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభలో సోదాహరణగా వివరించారు.
“ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి 1వ తేదీ నుంచి గడిచిన 32 నెలలుగా ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మొదటి తారీఖున చెల్లించాలని చెప్పాం.
ఉద్యోగులు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిన కారణంగా ఇప్పుడు నెలకు దాదాపు వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైరవుతున్న భారం పడుతోంది. గత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8 వేల కోట్లు బకాయి పెట్టింది. వారి బెనిఫిట్స్ కోసం వంద రోజుల్లో రూ. 6 వేల కోట్లు చెల్లించాం.
ఆరోగ్య భద్రత కార్డు లేకపోతే ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య భద్రత కార్డులను పునరుద్ధరించాం. తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్టీసీ ఉద్యోగుల్లో 60 మంది చనిపోగా, ఆ కుటుంబాలను పట్టించుకోకపోతే ప్రజాప్రభుత్వం వారికి అండగా నిలబడి కారుణ్య నియామకాలు చేపట్టాం. ఈ విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి” అని కోరారు.
“రైతులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 27.50 లక్షల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తో పాటు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం.
నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నిరుద్యోగులకు గడిచిన పదేండ్ల పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గ్రూప్ 1, 2, 3, 4లతో పాటు డాక్టర్లు, నర్సులు, పోలీసు ఉద్యోగాలు వేటిలోనూ నియామకాలు చేపట్టలేదు. రెండేండ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి, దేశంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టాం.
ఈ వెయ్యి రోజుల పరిపాలనలో రైతులు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 1 లక్షా 70 వేల కోట్లు ఖర్చు పెట్టింది. 30 నెలల్లో రైతుల వడ్లు కొనడానికి రూ. 90 వేల కోట్లు చెల్లించాం. రూ. 36 వేల కోట్లు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందించాం. 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. ఉచిత కరెంటు కోసం 30 వేల కోట్లు ఖర్చు చేశాం. గిట్టుబాటు ధరతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించాం. అప్పులు లేని రైతులు తెలంగాణలో ఎక్కువ ఉన్నారని కేంద్రం ప్రకటించింది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం తపన పడుతున్నాం.
వెయ్యి రోజుల పరిపాలనలో రాష్ట్రం దివాలా తీసిందంటారా? మా ప్రభుత్వ గొప్పతనం ఆడబిడ్డ కళ్లల్లోని వెలుగుల్లో కనిపిస్తుంది. కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించాం. స్వయం సహాయక సంఘాలకు రూ. 60 వేల కోట్లు బ్యాంకు లింకేజీ కల్పించాం. ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యమే కాకుండా వెయ్యి బస్సులకు ఆడబిడ్డలను యజమానులుగా చేశాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి గడిచిన 32 నెలల్లో మహిళల తరఫున ఆర్టీసీకి రూ. 11 వేల కోట్లు చెల్లించాం.
సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయిస్తున్నాం. హైటెక్ సిటీ శిల్పారామం వద్ద విలువైన 3.5 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి స్టాళ్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాం. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేశాం. 200 యూనిట్ల వరకు ఆడబిడ్డలకు ఉచిత విద్యుత్ అందించాం. రాష్ట్రంలో 1 కోటి 17 లక్షల రేషన్ కార్డులు జారీ చేశాం. 3.48 లక్షల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో ఆడబిడ్డలకు 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చాం. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో పేదలకు 1 లక్ష ఇందిరమ్మ ఇండ్లను (అపార్ట్‌మెంట్లు) కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం” అని విడమరిచి చెప్పారు.
“రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విశేష కృషి చేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరును సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రికి పెట్టుకున్నాం. త్వరలోనే అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభిస్తాం. అల్వాల్ టిమ్స్‌కు మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య పేరును, ఎల్బీనగర్ టిమ్స్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరును పెడతాం” అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
“గతంలో పేదల గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయని వారు ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూలిపోతున్నా పట్టించుకోలేదు. రూ. 2 వేల కోట్ల ఖర్చుతో పూర్తయ్యే ఆసుపత్రిని నిర్మించాలన్న ఆలోచన చేయలేదు.
సచివాలయం ఎదురుగా బహుజనుల ఆరాధ్యదైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని, చదువులే మన బతుకులు మార్చుతాయని చెప్పిన జ్యోతీరావు పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేశాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టాం” అని గుర్తుచేశారు.
“ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రజా ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎలా అంటారు? గత పాలనలో ఆడబిడ్డలు, రైతులు, నిరుద్యోగులకు చేసిందేమిటి? ప్రజలు ఈ తేడాను గమనించాలి. ఆలోచన చేయాలి. వెయ్యి రోజుల పాలనలో ఏం చేశావని అడిగే వారికి 8 వేల రోజుల పాలనలో, వెయ్యి రోజుల ప్రజా పాలనలో చేసిందేమిటన్నది అసెంబ్లీలో చెబుతాం” అని అన్నారు.
“40 ఏళ్లుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాం. 1931 తర్వాత వందేళ్లుగా జరగని కులగణన చేసి లెక్కలు తేల్చాం. గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం చట్టం చేయడం, స్పోర్ట్స్, ఐటీ, హెల్త్, టూరిజం, ఎండోమెంట్ పాలసీలను తీసుకొచ్చాం. అత్యద్భుతంగా సమ్మక్క – సారలమ్మ దేవాలయం నిర్మించుకున్నాం.
హైదరాబాద్ నగరం గొప్పగా అభివృద్ధి చెందుతోంది. నగరమే కాదు.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ఓఆర్ఆర్ లోపు కోర్ అర్భన్ రీజియన్ ఎకానమీగా, ఓఆర్ఆర్ అవతలివైపు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య భాగం పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా, రీజినల్ రింగ్ రోడ్డు బయటి ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా.. మూడు భాగాలుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం.
ఇవన్నీ ప్రజా ప్రభుత్వ వెయ్యి రోజుల పరిపాలన విజయం కాదా. మాతో పోలికేంటి? పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం. పరిపాలన పట్టాలెక్కింది. అభివృద్ధి వైపు నడిచే ప్రయాణంలో ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలబడాలి” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said that the People’s Government has taken revolutionary decisions during its 1,000 days in office to steer Telangana, which had suffered devastation, towards development. He explained that, during these 1,000 days of governance, several programmes were implemented for the welfare of farmers, women, youth, students and employees, along with far-sighted and bold decisions on several social issues, including the caste census and SC categorisation.
“Telangana had been pushed into a severe financial crisis. Over the past 1,000 days, we have saved and mobilised every rupee and brought the state from a thorny path onto a highway. As we are steering Telangana from destruction towards development, some people who cannot tolerate this progress are trying to obstruct development. We have put governance back on track by resolving problems one by one. I will run the government smoothly and continue to work tirelessly for the people,” the Chief Minister said in a strong response.
The Chief Minister addressed the gathering and local residents at a public meeting organised at the Amberpet Municipal Ground on the occasion of the inauguration of the newly constructed high-level bridge over the Musi River at Moosarambagh. On the occasion, he also unveiled the logos of the Hyderabad (GHMC), Malkajgiri (MMC), and Cyberabad (CMC) Municipal Corporations.
At the meeting, he explained in detail, with examples, the development and welfare programmes undertaken by the People’s Government during its 1,000 days of governance.
No translation is available for this record. It has not been machine-translated, and nothing downstream depends on one.
Is the reported event good or bad news, independent of who is describing it?
Is the author supportive of or critical toward the subject? Kept separate from the event.
Inferred from engagement shape where the platform exposes it. Absent here means absent, not neutral.
Sentiment directed specifically at the tracked subject, scoped to the sentence naming them.
Never flips a label. It only reduces confidence.
Threshold for inclusion is 0.35.
- critical markers: వైఫల్యం, పట్టించుకోలేదు
- subject sentiment scoped to the sentence containing the mention (Δ=0.00)
- no audience reaction data available for this item
- A. Revanth ReddySubjectmatched “A Revanth Reddy” via exact · chars 15–30
- Greater Hyderabad Municipal Corporationmatched “GHMC” via exact · chars 63–67
- Hyderabadmatched “Hyderabad” via exact · chars 92–101
- A. Revanth ReddySubjectmatched “రేవంత్ రెడ్డి” via exact · chars 326–339
- Government of Telanganamatched “ప్రభుత్వాన్ని” via skeleton · chars 846–859
- Hyderabadmatched “హైదరాబాద్” via exact · chars 1154–1163
- Greater Hyderabad Municipal Corporationmatched “GHMC” via exact · chars 1164–1168
- Government of Telanganamatched “ప్రభుత్వం” via exact · chars 1250–1259
- Government of Telanganamatched “ప్రభుత్వం” via exact · chars 1722–1731
- Telanganamatched “తెలంగాణ” via exact · chars 1953–1960
- TGSRTCmatched “ఆర్టీసీ” via exact · chars 1998–2005
- Government of Telanganamatched “ప్రభుత్వం” via exact · chars 2255–2264
- Telanganamatched “తెలంగాణ” via exact · chars 2426–2433
- Government of Telanganamatched “ప్రభుత్వం” via exact · chars 2795–2804
- Rythu Bharosamatched “రైతు భరోసా” via exact · chars 2924–2934
- Rythu Runa Mafimatched “రుణమాఫీ” via exact · chars 3007–3014
- Government of Telanganamatched “ప్రభుత్వం” via exact · chars 4655–4664
- Government of Telanganamatched “ప్రభుత్వం” via exact · chars 5103–5112
- Telangana Legislative Assemblymatched “అసెంబ్లీలో” via skeleton · chars 5339–5349
- Hyderabadmatched “హైదరాబాద్” via exact · chars 5638–5647
- Telanganamatched “తెలంగాణ” via exact · chars 5693–5700
- Regional Ring Roadmatched “రీజినల్ రింగ్ రోడ్డు” via exact · chars 5797–5817
- Regional Ring Roadmatched “రీజినల్ రింగ్ రోడ్డు” via exact · chars 5857–5877
- Telanganamatched “తెలంగాణ” via exact · chars 6098–6105
- A. Revanth ReddySubjectmatched “A Revanth Reddy” via exact · chars 6294–6309
- Telanganamatched “Telangana” via exact · chars 6419–6428
- Telanganamatched “Telangana” via exact · chars 6750–6759
- Telanganamatched “Telangana” via exact · chars 6947–6956
- Hyderabadmatched “Hyderabad” via exact · chars 7563–7572
- Greater Hyderabad Municipal Corporationmatched “GHMC” via exact · chars 7573–7577
- Employment & Jobs0.25terms: ఉద్యోగ, ఉద్యోగాలు, నిరుద్యోగ, గ్రూప్ 1, భర్తీ
- Agriculture & Farmers0.25terms: రైతు, రైతుల, రుణమాఫీ, రైతు భరోసా, farmers
- Women & Welfare0.25terms: మహిళ, మహిళల, స్వయం సహాయక, ఉచిత బస్సు, women
- Welfare Delivery0.24terms: రేషన్, సంక్షేమ
- Hyderabad0.95explicit mention · “Hyderabad”
- Warangal Urban0.95explicit mention · “వరంగల్”
- names the tracked subject
- references government entities: org.ghmc, org.telangana_government, scheme.rythu_bharosa
- policy-relevant topic "employment" (weight 0.25)
- names a Telangana place explicitly (hyderabad)
- SCOUTacquireDeterministic ruleconnector:live.tg.gov.press31 Aug 15:25Acquires source material
Captured from Government of Telangana — press releases. Stored verbatim; this record is never modified.
- LINGUAlanguageLexicon modellingua@1.0.031 Aug 15:25Language identification and translation
Detected mixed/mixed at 82% confidence. telugu glyphs 5233 (79%); latin glyphs 1418 (21%); both scripts present above 15% — code-switched. No translation required or available.
1 input reference
- ATLASentitiesLexicon modelatlas@1.0.0+lexicon@1.0.031 Aug 15:25Entities, topics, places and stance
Linked 30 entity mention(s). exact alias "రీజినల్ రింగ్ రోడ్డు" -> project.regional_ring_road; exact alias "రీజినల్ రింగ్ రోడ్డు" -> project.regional_ring_road; exact alias "A Revanth Reddy" -> person.revanth_reddy; exact alias "A Revanth Reddy" -> person.revanth_reddy.
1 input reference
- ATLAStopicsLexicon modelatlas@1.0.0+lexicon@1.0.031 Aug 15:25Entities, topics, places and stance
Topics: employment: ఉద్యోగ, ఉద్యోగాలు, నిరుద్యోగ, గ్రూప్ 1, భర్తీ | agriculture: రైతు, రైతుల, రుణమాఫీ, రైతు భరోసా, farmers | women_welfare: మహిళ, మహిళల, స్వయం సహాయక, ఉచిత బస్సు, women | welfare_schemes: రేషన్, సంక్షేమ.
- ATLASlocationDeterministic ruleatlas@1.0.0+lexicon@1.0.031 Aug 15:25Entities, topics, places and stance
"Hyderabad" (district) -> hyderabad; "హైదరాబాద్" (district) -> hyderabad; "వరంగల్" (district) -> warangal_urban; "GHMC" (district) -> hyderabad
- ATLASrelevanceDeterministic ruleatlas@1.0.0+lexicon@1.0.031 Aug 15:25Entities, topics, places and stance
Relevance 1.00. names the tracked subject; references government entities: org.ghmc, org.telangana_government, scheme.rythu_bharosa; policy-relevant topic "employment" (weight 0.25); names a Telangana place explicitly (hyderabad).
- ATLASstanceLexicon modelinterpret@1.0.0+lexicon@1.0.031 Aug 15:25Entities, topics, places and stance
Event valence neutral; author stance critical; intent complaint; emotion none. critical markers: వైఫల్యం, పట్టించుకోలేదు; subject sentiment scoped to the sentence containing the mention (Δ=0.00). Caveats: no audience reaction data available for this item.
- WEAVERstory clusterStatisticalweaver.cluster@1.0.031 Aug 15:25Deduplication, stories and narratives
Opened a new story cluster; best match against existing clusters scored 0.315 (threshold 0.34).
1 input reference
Each step names the agent that ran it, the method it used and the version of the rules or model behind it. A step describing what it did not find is recorded on the same footing as one that found something, so that gaps in the analysis are visible rather than absent.