Live public sources
Search
02 Sep · 20:04 IST
NTV Telugu — TelanganaWeb newsTelugu mediaDemonstration record
Published Wed, 02 September 2026, 08:15 IST · captured Wed, 02 September 2026, 08:15 IST
https://ntvtelugu.com/news/pawan-kalyan-birthday-tragedy-fan-dies-of-electric-shock-in-amalapuram-1011126.html
Original text — Telugu
never modified

Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!

Pawan Kalyan Birthday Tragedy: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో పాల్గొన్న ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్‌ కుమార్. ప్రేమ్‌ మరణంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పెను విషాదం నెలకొంది.

ప్రేమ్‌ కుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి నిర్వహించాలనే ఉద్దేశంతో స్వగ్రామానికి వచ్చాడు. అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో ప్రేమ్‌ కుమార్‌ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రేమ్‌ కుమార్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా వచ్చిన యువకుడు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో జనసేన కార్యకర్తలు, స్థానికుల్లో కూడా విషాదం నెలకొంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా భద్రతా చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

English rendering

No translation is available for this record. It has not been machine-translated, and nothing downstream depends on one.

Interpretation
68% confidence
Event valence
Negative

Is the reported event good or bad news, independent of who is describing it?

Author stance
Demanding

Is the author supportive of or critical toward the subject? Kept separate from the event.

Audience signal
Not available

Inferred from engagement shape where the platform exposes it. Absent here means absent, not neutral.

Subject sentiment
Subject not named

Sentiment directed specifically at the tracked subject, scoped to the sentence naming them.

Emotion
None
Author intent
Reporting
Sarcasm risk
0%

Never flips a label. It only reduces confidence.

Relevance
0.50

Threshold for inclusion is 0.35.

What fired
  • negative-event terms: ప్రమాదం, మృతి
  • demanding markers: వెంటనే
Why this could be wrong
  • no audience reaction data available for this item
  • the tracked subject is not named — no subject-directed sentiment is asserted
Medium confidenceinterpret@1.0.0+lexicon@1.0.0
Extraction
Entities linked
  • Mallu Bhatti Vikramarka
    matched “ఉప ముఖ్యమంత్రి” via exact · chars 197211
Topics
  • Electricity0.34
    terms: కరెంట్, విద్యుత్
  • Education0.32
    terms: విద్య
  • Law & Order0.20
    terms: పోలీసు, భద్రత
  • Employment & Jobs0.13
    terms: ఉద్యోగ
Places
  • Hyderabad0.95
    explicit mention · “హైదరాబాద్
Relevance basis
  • references other public figures or parties in state discourse
  • policy-relevant topic "electricity" (weight 0.34)
  • names a Telangana place explicitly (hyderabad)
Processing history for this record
8 recorded steps
  1. SCOUTacquireDeterministic ruleconnector:live.media.ntvtelugu02 Sep 08:15
    Acquires source material

    Captured from NTV Telugu — Telangana. Stored verbatim; this record is never modified.

  2. LINGUAlanguageLexicon modellingua@1.0.002 Sep 08:15
    Language identification and translation

    Detected te/telugu at 99% confidence. telugu glyphs 1231 (97%); latin glyphs 40 (3%). No translation required or available.

    1 input reference

  3. ATLASentitiesLexicon modelatlas@1.0.0+lexicon@1.0.002 Sep 08:15
    Entities, topics, places and stance

    Linked 1 entity mention(s). exact alias "ఉప ముఖ్యమంత్రి" -> person.bhatti_vikramarka.

    1 input reference

  4. ATLAStopicsLexicon modelatlas@1.0.0+lexicon@1.0.002 Sep 08:15
    Entities, topics, places and stance

    Topics: electricity: కరెంట్, విద్యుత్ | education: విద్య | law_and_order: పోలీసు, భద్రత | employment: ఉద్యోగ.

  5. ATLASlocationDeterministic ruleatlas@1.0.0+lexicon@1.0.002 Sep 08:15
    Entities, topics, places and stance

    "హైదరాబాద్" (district) -> hyderabad

  6. ATLASrelevanceDeterministic ruleatlas@1.0.0+lexicon@1.0.002 Sep 08:15
    Entities, topics, places and stance

    Relevance 0.50. references other public figures or parties in state discourse; policy-relevant topic "electricity" (weight 0.34); names a Telangana place explicitly (hyderabad).

  7. ATLASstanceLexicon modelinterpret@1.0.0+lexicon@1.0.002 Sep 08:15
    Entities, topics, places and stance

    Event valence negative; author stance demanding; intent reporting; emotion none. negative-event terms: ప్రమాదం, మృతి; demanding markers: వెంటనే. Caveats: no audience reaction data available for this item; the tracked subject is not named — no subject-directed sentiment is asserted.

  8. WEAVERstory clusterStatisticalweaver.cluster@1.0.002 Sep 08:15
    Deduplication, stories and narratives

    Opened a new story cluster; best match against existing clusters scored 0.28 (threshold 0.34).

    1 input reference

Reading this

Each step names the agent that ran it, the method it used and the version of the rules or model behind it. A step describing what it did not find is recorded on the same footing as one that found something, so that gaps in the analysis are visible rather than absent.